PhonePe అప్లికేషన్‌ను కంపెనీల చట్టం, 1956 కింద ఇన్‌కార్పొరేట్ చేయబడిన కంపెనీ అయిన PhonePe ప్రైవేట్ లిమిటెడ్ (గతంలో FX మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్) అభివృద్ధి చేసింది.
దీని రిజిస్టర్ కార్యాలయం ఆఫీస్-2, 4,5,6,7 అంతస్తులు, వింగ్ A, బ్లాక్ A, సలార్ పురియా సాఫ్ట్ జోన్, సర్వీస్ రోడ్డు, గ్రీన్ గ్లెన్ లేఅవుట్, బెల్లందూర్, బెంగళూరు, కర్ణాటక-KA, పిన్- 560103 చిరునామాలో ఉంది..
PhonePeలో మేము మాపై పెట్టుకున్న నమ్మకాన్ని గౌరవిస్తున్నాము. మీకు అత్యుత్తమ అనుభవాన్ని అందించాలని కృత నిశ్చయంతో ఉన్నాము. మా కస్టమర్లతో న్యాయంగా, గౌరవపూర్వకంగా వ్యవహరిస్తూనే కస్టమర్ సమస్యలను సకాలంలో, సమర్థవంతమైన పద్ధతిలో పరిష్కరించే రీతిలో మా సమస్య పరిష్కార విధానం రూపొందించబడింది.
PhonePe యాప్ ద్వారా లావాదేవీలను నిర్వహిస్తున్నప్పుడు నిరంతరాయమైన అనుభవాన్ని మీకు అందించాలనేది మా ధ్యేయం. అలాగే అవసరమైనప్పుడు, మా ఇన్-యాప్ కస్టమర్ సమస్య పరిష్కార సహాయ ప్రక్రియ మీ అన్ని రకాల ఆందోళనలను పరిష్కరించే సామర్థ్యం కలిగి ఉంది. వివిధ రకాల మానవ, నెట్ వర్క్, సిస్టం లోపాల వల్ల చోటు చేసుకునే కొన్ని అరుదైన సందర్భాల్లో, కొన్ని సమస్యలకు మరింత దృష్టి కేంద్రీకరించిన, కస్టమైజ్ చేసిన పరిష్కారాలు కావాల్సి ఉన్నందున, మీరు వరుస క్రమంలో కింది పరిష్కార యంత్రాంగాన్ని సంప్రదించాల్సి రావచ్చు.
సమస్య పరిష్కార యంత్రాంగం
మీ సమస్యలు సరైన బృందం వైపునకు మళ్లించబడి, పరిష్కరించబడేలా చూసేందుకు మేము ఒక సమస్యలను లేవనెత్తే విధానాన్ని రూపొందించాము. మీ సమస్యను సకాలంలో పరిష్కరించేలా చూసేందుకు కింద పేర్కొన్న సమస్యలను లేవనెత్తే విధానాన్ని చదివి, అర్థం చేసుకోవాలని సూచిస్తున్నాము. .
మా కస్టమర్లు స్వయం సహాయాన్ని పొందే రీతిలో అందించిన మా సహాయ పేజీలను చాలా జాగ్రత్తగా చూడాలని మేము సిఫార్సు చేస్తున్నాము. సహాయ పేజీల ద్వారా పరిష్కరించని సందేహాలు, సమస్యల కోసం, ఫోన్, ఇమెయిల్ లేదా PhonePe యాప్ ద్వారా మా కస్టమర్ సహాయ బృందాన్ని మీరు సంప్రదించవచ్చు.
మా ఇన్-యాప్ సహాయ ఛానెల్ పెద్ద సంఖ్యలో కస్టమర్ ఫిర్యాదులను పరిష్కరించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. మీ సమస్యను తదుపరి దశకు తీసుకెళ్లాలని కోరుకునే ఎలాంటి అసాధారణ పరిస్థితిలో అయినా, మీరు ఇప్పటికే పూర్వపు దశ(ల)ను దాటి వచ్చారని, మీ సమస్య ఇంకా పరిష్కారం కాలేదని లేదా మీకు తృప్తిని కలిగించే రీతిలో పరిష్కరించబడలేదని మీరు నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.
సేవా స్థాయిలు
రీఛార్జ్, బిల్ పే, PhonePe వాలెట్, Phonepe గిఫ్ట్ కార్డ్‌లు, UPI (ఏకీకృత పేమెంట్‌ల ఇంటర్‌ఫేస్), దుకాణాలు, పెట్టుబడులు, PhonePe స్విచ్, వౌచర్‌లకు సంబంధించిన సేవా స్థాయిలు.
1వ స్థాయి
- ఫిర్యాదుల రిజిస్ట్రేషన్:
- PhonePe యాప్ హోమ్ పేజీలో ఉన్న(?) గుర్తును క్లిక్ చేయడం ద్వారా PhonePe వినియోగదారు సహాయ విభాగం వద్ద మీరు మీ ఫిర్యాదును రిజిస్టర్ చేయవచ్చు.
- మేము రోజులో 24 గంటలపాటు, వారానికి 7 రోజులు వినియోగదారు సహాయ సేవను అందిస్తాము.
- ఫిర్యాదుల పరిష్కారం:
- ఫిర్యాదును అందుకున్న తర్వాత 24 గంటలలోపు మేము మీకు మొదటి స్పందనను ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాము.
- మేము మీ ఫిర్యాదులు/సందేహాలను 3 పని దినాల్లో పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము.
- నిర్వహక లేదా సాంకేతిక కారణాల వల్ల మీ ఫిర్యాదు పరిష్కారం ఆలస్యం కావచ్చు. అలాంటి సందర్భంలో, మీ ఫిర్యాదు పరిష్కార స్థితి గురించిన టైమ్‌లైన్‌ల వివరాలు మీకు ఎప్పటికప్పుడు తెలియజేయబడతాయి.
- కొన్ని సందర్భాల్లో, ఫిర్యాదుకు తక్షణమే పరిష్కారం దొరికినప్పటికీ, అది సిస్టమ్‌లో కనిపించడానికి కొంత సమయం పట్టవచ్చు. ఉదాహరణకు, రీఫండ్ ఆమోదం తక్షణమే జరుగుతుంది, కానీ అకౌంట్‌లో డబ్బు అందడానికి 3-10 రోజులు పట్టవచ్చు. ఇలాంటి ఆలస్యాలు బ్యాంకులు, ఆపరేషనల్ సమస్యలకు సంబంధించినవని దయచేసి గమనించండి.
- వివిధ ఏజెన్సీల ప్రమేయం ఉన్నందున ‘మోసం, రిస్క్ అసెస్‌మెంట్’కు సంబంధించిన ఫిర్యాదుల విచారణకు కొంత ఎక్కువ సమయం పడుతుంది. అలాంటి కేసులలో, కేసు తీవ్రత, సంక్లిషతల మీద పరిష్కార సమయం ఆధారపడి ఉంటుంది. అలాంటి సందర్భాలలో, టైమ్‌లైన్‌ల గురించి మీకు ఎప్పటికప్పుడు తెలియజేయబడుతుంది.
గమనిక: పరిష్కారం విషయంలో ఏవైనా ఆలస్యాలు ఉంటే, వినియోగదారులకు ఎప్పటికప్పుడు తెలియజేయబడతాయి. ఒకవేళ వినియోగదారు సంతృప్తి చెందకపోతే, ఫిర్యాదులు 2వ స్థాయికి తీసుకెళ్లబడుతాయి.
2వ స్థాయి
- ఫిర్యాదుల రిజిస్ట్రేషన్
మీ ఫిర్యాదును లేవనెత్తడానికి మీరు కింద తెలిపిన మార్గాల్లో దేనినైనా ఉపయోగించి, ఫిర్యాదులను రిజిస్టర్ చేయవచ్చు. https://support.phonepe.com/ లో ఫిర్యాదును రిజిస్టర్ చేయడం
080-68727374/022-68727374 నంబర్‌పై మా వినియోగదారు సహాయ విభాగానికి కాల్ చేయడం.
2. ఫిర్యాదుల పరిష్కారం:
ఫిర్యాదును అందుకున్న తర్వాత 24 గంటలలోపు మేము మీకు మొదటి స్పందనను ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం.
2వ స్థాయిలో ఉన్న అన్ని ఫిర్యాదులను 3 పని దినాల్లోపు పరిష్కరించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. పరిష్కార సమయంలో ఏదైనా ఆలస్యం ఉంటే మీకు వెంటనే తెలియజేయబడుతుంది.
3వ స్థాయి
ఫిర్యాదుల రిజిస్ట్రేషన్:
ముందు దశల్లోపు మీ సమస్య పరిష్కారం కాకుంటే సమస్య పరిష్కార విభాగాన్ని మీరు కింది విధంగా సంప్రదించవచ్చు
- PhonePe QR యేతర మార్గాల ద్వారా పేమెంట్లకు సంబంధించిన సమస్యల కోసం 30 రోజుల్లో
- ఇతర లావాదేవీ రకానికి సంబంధించిన సమస్యల కోసం 10 రోజుల్లో
సమాచార సాంకేతిక చట్టం, 2000, అందులోని నియమాలకు అనుగుణంగా, ఫిర్యాదుల అధికారి పేరు, సంప్రదింపు వివరాలు కింది తెలియజేయబడ్డాయి:
సంప్రదించండి:
ప్రిన్సిపల్ నోడల్ ఆఫీసర్: శిను సుధాకర్
నోడల్ ఆఫీసర్:సింజన్ కుమార్ సాహా
ఫోన్ నెంబర్: 080-68727374 / 022-68727374
వెబ్‌పేజీ: grievance.phonepe.com
చిరునామా-ఆఫీస్-2, 4,5,6,7 అంతస్తులు, వింగ్ ఎ, సలార్ పురియా సాఫ్ట్ జోన్, సర్వీస్ రోడ్,గ్రీన్ గ్లెన్ లే అవుట్, బెల్లందూర్, బెంగళూరు, కర్ణాటక-KA పిన్-560103,
పనిచేయు వేళలు: సోమ-శుక్ర, ఉదయం 10 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు.
2. ఫిర్యాదుల పరిష్కారం:
ఫిర్యాదును అందుకున్న తర్వాత 24 గంటలలోపు మేము మీకు మొదటి స్పందనను ఇవ్వడానికి అంకితభావంతో ఉన్నాం. 3వ స్థాయిలో ఉన్న అన్ని ఫిర్యాదులను 7 వ్యాపార దినాల్లోగా పరిష్కరించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. పరిష్కార సమయంలో ఏదైనా ఆలస్యం ఉంటే మీకు వెంటనే తెలియజేయబడుతుంది.
4వ స్థాయి
మునుపటి స్థాయులలో 30 రోజులలోపు మీ సందేహం లేదా ఫిర్యాదుకు సంతృప్తికరమైన పరిష్కారం లభించకపోతే, మీరు డిజిటల్ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చు. మరిన్ని వివరాల కోసం.
అంబుడ్స్ మేన్ ఫిర్యాదు పోర్టల్: https://cms.rbi.org.in/
టోల్ ఫ్రీ నెంబర్: 14448
ఇమెయిల్ ఐడి: [email protected]
చిరునామా- సెంట్రలైజ్డ్ రిసీప్ట్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
నాలుగో అంతస్తు, సెక్టార్-
17, చండీఘర్- 160017
దయచేసి లింక్ చూడండి – RBI అంబుడ్స్ మేన్ RBI Ombudsman.
వినియోగదారు బాధ్యతా పరిమితి
అధీకృతం చేయని పేమెంట్ లావాదేవీకి సంబంధించి వినియోగదారు బాధ్యతా పరిమితి దిగువ తెలిపిన వాటిని పరిమితమై ఉంటుంది:
క్ర.సం. | అంశాలు | వినియోగదారు బాధ్యత గరిష్టత |
---|---|---|
1 | PhonePe వైపు నుండి కలిగిన మోసం/నిర్లక్ష్యం/లోపం, (లావాదేవీని వినియోగదారు రిపోర్ట్ చేశారా చేయలేదా అని సంబంధం లేకుండా) | సున్నా |
2 | థర్డ్-పార్టీ ఉల్లంఘన అంటే అటు PhonePeకు గానీ, ఇటు వినియోగదారుకు గానీ సంబంధం లేకుండా సిస్టమ్‌లో మరెక్కడైనా లోపం జరిగి, అధీకృతం చేయని పేమెంట్ లావాదేవీ గురించి వినియోగదారు తెలియజేయడం. అలాంటి సందర్భాల్లో ప్రతి లావాదేవీకి వినియోగదారు బాధ్యత అనేది లావాదేవీ గురించి వినియోగదారు, PhonePeకు తెలియజేసిన తర్వాత గడిచిన రోజుల సంఖ్య, PhonePeకు అధీకృతం చేయని లావాదేవీల గురించి వినియోగదారు రిపోర్ట్ చేయడంపై ఆధారపడి ఉంటుంది – | |
i. మూడు రోజుల్లోగా# | సున్నా | |
ii. నాలుగు నుండి ఏడు రోజుల్లోగా# | లావాదేవీ విలువ లేదా ప్రతి లావాదేవీకి ₹10,000/-, ఏది తక్కువ ఉంటే అది | |
iii. ఏడు రోజులు దాటితే# | ప్రతి సందర్భం ఆధారంగా PhonePe నిర్ణయిస్తుంది. | |
3 | పేమెంట్ క్రెడెన్షియల్స్ షేర్ చేయడం లాంటి వినియోగదారు నిర్లక్ష్య ధోరణి వల్ల నష్టం జరిగిన సందర్భాల్లో, అతను/ఆమె అధీకృతం చేయని లావాదేవీ గురించి PhonePeకు రిపోర్ట్ చేయనంతవరకు పూర్తి నష్టాన్ని అతను/ఆమె భరించాలి. అధీకృతం చేయని లావాదేవీని నివేదించిన తర్వాత ఏదైనా నష్టం కలిగితే దాన్ని PhonePe భరిస్తుంది. | |
4 | PhonePe తమ స్వీయ విచక్షణ మేరకు, అంగీకరించని ఎలక్ట్రానిక్ పేమెంట్ లావాదేవీల విషయంలో (వినియోగదారు నిర్లక్ష్యం వల్ల జరిగిన వాటికి కూడా) ఏదైనా వినియోగదారు బాధ్యత నుండి మినహాయింపును ఇవ్వవచ్చు. |
పరిమిత బాధ్యతపై వినియోగదారు జవాబుదారీతనం.
- బలమైన పాస్‌వర్డ్‌లు, పిన్ నంబర్‌లు ఉపయోగిస్తూ వినియోగదారులు తమ ఖాతాలను సురక్షితంగా ఉంచుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలి. ఈ పాస్‌వర్డ్‌లు, పిన్ నంబర్‌లను తరచుగా మారుస్తుండాలి. పిన్ నంబర్‌లు / పాస్‌వర్డ్‌లు, OTPలను PhonePe ఉద్యోగులతో సహా ఎవరికీ కూడా ఈమెయిల్/టెలిఫోన్ ద్వారా షేర్ చేయకూడదు. అలాంటి యోగ్యతలను పంచుకోవాలని PhonePe ఎప్పటికీ అడగదు.
- ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందుకుంటూ, అలర్ట్‌లను పొందడానికి PhonePe వద్ద ఉన్న వారి మొబైల్ నంబర్‌లు, ఈమెయిల్ ఐడీలను వినియోగదారులు తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాలి.
- ఎలక్ట్రానిక్ పేమెంట్ లావాదేవీల కోసం వినియోగదారులు తప్పనిసరిగా SMS అలర్ట్‌లు, ఈ-మెయిల్ అలర్ట్‌ల కోసం (ఏది వర్తిస్తే అది) రిజిస్టర్ చేసుకోవాలి.
- ఏదైనా అనధికారికమైన లావాదేవీని గుర్తించడానికి వీలుగా SMS అలర్ట్‌ల ద్వారా గానీ లేదా మొబైల్ యాప్ ద్వారా గానీ వినియోగదారులు తరచుగా లావాదేవీలను పర్యవేక్షిస్తుండాలి.
- PhonePeలో ఖాతాకు సంబంధించి ఏదైనా అంగీకారం లేని లావాదేవీ జరిగితే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా, వెంటనే ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత వినియోగదారుపై ఉంటుంది.
BBPS వద్ద వివాదాన్ని లేవనెత్తడం
BBPS వద్ద బిల్లు పే సమస్యను లేవనెత్తడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- ఈ లింక్ ద్వారా లేవనెత్తిన ఫిర్యాదులను NPCI నియమించిన ఆపరేటింగ్ యూనిట్‌లు పరిష్కరిస్తాయి.
- ఈ ఫిర్యాదులను Phonepe పరిష్కరించదని, ఫిర్యాదు ఎప్పుడు పరిష్కరించబడుతుందనే విషయం గురించి ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వబడదని దయచేసి గమనించండి.
ఆధార్ eKYC సమస్య పరిష్కారం
- ఆధార్ eKYC మరియు అంగీకారాన్ని ఉపసంహరించుకోవడానికి సంబంధించిన సమస్యలు ఉంటే, కింద పేర్కొన్న మార్గాల ద్వారా మర్చంట్ మమ్మల్ని సంప్రదించవచ్చు లేదా ఫిర్యాదు లేవనెత్తవచ్చు:
- ఇన్ బౌండ్ సహాయ బృందాన్ని మర్చంట్లు 080-6872-7777/ 022-6872-7777లో సంప్రదించవచ్చు.
- మర్చంట్లు ఇన్-యాప్ సహాయం ద్వారా కూడా టికెట్ లేవనెత్తవచ్చు.
- రిజిస్టర్డ్ మూలం నుంచి ఫిర్యాదు అందిందా అని నిర్ధారించడం కోసం, రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడి లేదా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ను మర్చంట్ నిర్ధారించాల్సి ఉంటుంది. లేవనెత్తిన సమస్యల రకం ఆధారంగా, ఈ టికెట్ నిర్దేశిత టైమ్ లైన్స్ లోపు దీనిని పరిష్కరించగల సంబంధిత అంతర్గత బృందాలకు పంపబడుతుంది.
- ఆన్ బోర్డింగ్ సంబంధిత సమస్యల పరిష్కారానికి గడువు 5 పనిదినాలు కాగా, అంగీకార ఉపసంహరణకు గడువు 30 క్యాలెండర్ రోజులుగా ఉంటాయి.
మర్చంట్స్ సమస్యల పరిష్కార విభాగం
ఆఫ్‌లైన్ మర్చంట్ల కోసం
1వ దశ
- ఫిర్యాదుల రిజిస్ట్రేషన్:
- PhonePe బిజినెస్ యాప్ లోని హోమ్ పేజీలో ఉన్న(?) పై క్లిక్ చేయడం ద్వారా PhonePe మర్చంట్ సహాయ విభాగం వద్ద మీరు ఫిర్యాదు లేవనెత్తవచ్చు.
- b. PhonePe బిజినెస్ డాష్ బోర్డ్ లోని హోమ్ పేజీలో (?) పై క్లిక్ చేయడం ద్వారా https://business.phonepe.com/faqలో కూడా మీరు ఫిర్యాదు రిజిస్టర్ చేసుకోవచ్చు.
- రోజుకు 24 గంటల చొప్పున వారంలో 7 రోజులూ మేము కస్టమర్ మద్దతు సేవలను మేము అందిస్తాము.
2. ఫిర్యాదుల పరిష్కారం:
- ఫిర్యాదు అందుకున్న 24 గంటల్లోపు మా మొదటి స్పందనను మీకు అందించడానికి కట్టుబడి ఉన్నాము.
- 7 రోజుల్లోపు మీ ఫిర్యాదులు/సందేహాలను పరిష్కరించాలని మేము ధ్యేయంగా పెట్టుకున్నాము
- బ్యాంకింగ్, ఆపరేషనల్, సాంకేతిక కారణాలతో మీ ఫిర్యాదు పరిష్కారంలో జాప్యం జరగవచ్చు. ఇలాంటి సందర్భంలో, మీ ఫిర్యాదును పరిష్కరించే సమయంలో టైమ్ లైన్స్ గురించి మీకు సమాచారం అందించబడుతుంది.
- అనేక ఏజెన్సీల పాత్రతో కూడుకున్నందున ‘మోసం మరియు రిస్క్ మదింపు’నకు సంబంధించిన ఫిర్యాదులపై విచారణ కొన్ని సందర్భాల్లో ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇలాంటి సందర్భాల్లో పరిష్కార సమయం కేసు తీవ్రత, సంక్లిష్టతపై ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో టైమ్ లైన్స్ గురించి మీకు చురుగ్గా సమాచారం అందించబడుతుంది.
గమనిక: పరిష్కారంలో ఏదైనా జాప్యం జరిగితే వినియోగదారులకు సమాచారం అందించబడుతుంది.
వినియోగదారుడు సంతృప్తి చెందకుంటే, ఫిర్యాదులు 2వ దశకు లేవనెత్తబడుతాయి.
2వ దశ
- ఫిర్యాదుల రిజిస్ట్రేషన్:
మీ ఫిర్యాదును లేవనెత్తడానికి మీరు కింది ఛానెల్ ను యాక్సెస్ చేసుకోవచ్చు. మా మర్చంట్ సహాయ విభాగానికి 080-6872-7777/ 022-6872-7777లో కాల్ చేయండి. ఉదయం 7 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు మా సేవలను అందిస్తాము.
2. ఫిర్యాదుల పరిష్కారం:
- కాల్ వచ్చిన వెంటనే మేము మొదటి స్పందన ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నాము.
- 2వ దశ ఫిర్యాదు లన్నిటినీ 7 రోజుల్లోపు పరిష్కరించాలని ధ్యేయంగా పెట్టుకున్నాము. పరిష్కారంలో ఏదైనా జాప్యం జరిగితే మీకు వెంటనే సమాచారం అందించబడుతుంది.
3వ దశ
1. ఫిర్యాదుల రిజిస్ట్రేషన్:
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000, దానికింద ఉన్న నిబంధనలకు అనుగుణంగా నోడల్ అధికారి, ప్రిన్సిపల్ నోడల్ అధికారి పేరు, సంప్రదింపు వివరాలు కింద ఇవ్వబడ్డాయి:
సంప్రదించండి:
ప్రిన్సిపల్ నోడల్ అధికారి – శిను సుధాకర్
నోడల్ అధికారి /గ్రీవెన్స్ అధికారి – సించన్ కుమార్ సాహా
ఫోన్: 080-6872-7777/ 022-6872-7777
వెబ్ పేజీ: https://grievance.phonepe.com/
చిరునామా – ఆఫీస్-2, 4,5,6,7 అంతస్తులు, A వింగ్, A బ్లాగ్, సలార్ పురియా సాఫ్ట్ జోన్, సర్వీస్ రోడ్, గ్రీన్ గ్లెన్ లేఅవుట్, బెల్లందూర్, బెంగళూరు, కర్ణాటక-KA, పిన్ కోడ్- 560103.
పని వేళలు: సోమ నుండి శుక్రవారం వరకు ఉదయం 10 నుండి సాయంత్రం 7 గంటల వరకు
2. ఫిర్యాదుల పరిష్కారం:
ఫిర్యాదు అందుకున్న 24 గంటల్లోపు మొదటి స్పందనను అందించాలను కృత నిశ్చయంతో ఉన్నాము. 3వ దశ ఫిర్యాదు లన్నిటినీ 7 పని దినాల్లో పరిష్కరించాలని ధ్యేయంగా పెట్టుకున్నాము. పరిష్కార సమయంలో ఏదైనా జాప్యం ఉంటే, మీకు వెంటనే సమాచారం అందించబడుతుంది.
4వ దశ
మీ సందేహం లేదా ఫిర్యాదు ఇదివరకటి దశల వద్ద 30 రోజుల్లో పరిష్కారం కాకుంటే, మీరు డిజిటల్ అంబుడ్స్ మేన్ ను సంప్రదించవచ్చు.
అంబుడ్స్ మేన్ ఫిర్యాదు నివేదన పోర్టల్: https://cms.rbi.org.in/
టోల్-ఫ్రీ ఫోన్ నెం: 14448
ఇమెయిల్ ఐడి: [email protected]
చిరునామా – సెంట్రలైజ్డ్ రిసీట్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 4వ అంతస్తు, సెక్టార్ 17, చండీఘర్– 160017
మరిన్ని వివరాలకోసం, దయచేసి కింది లింక్ ను చూడండి- RBI Ombudsman.
ఆన్‌లైన్ మర్చెంట్ల కోసం రూపొందించిన డాక్యుమెంట్
మొదటి స్థాయి
- ఫిర్యాదుల నమోదు:
- మీరు [email protected]కు మెయిల్ చేసి PhonePe మర్చెంట్ సహాయ విభాగానికి మీ సమస్యను తెలిపి, ఫిర్యాదను నమోదు చేసుకోవచ్చు.
- మేము వారం అంతటా, అంటే 7 రోజులలోనూ ఉదయం 10 నుండి సాయంత్రం 7 గంటల వరకు మర్చెంట్ సహాయ సేవలు అందిస్తాము.
- ఫిర్యాదుల పరిష్కారం:
- ఫిర్యాదును స్వీకరించిన 24 గంటలలోపు మా మొదటి ప్రతిస్పందనను మీకు తెలియచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాము.
- మీరు ఇచ్చే అన్ని ఫిర్యాదులు/సందేహాలను 7 రోజుల్లోగా పరిష్కరించడమే మా లక్ష్యం
- బ్యాంకింగ్, నిర్వహణ లేదా సాంకేతిక కారణాల వల్ల మీ ఫిర్యాదును పరిష్కరించేందుకు మాకు కాస్త ఎక్కువ సమయం పట్టవచ్చు. అటువంటి పరిస్థితిలో, మీ ఫిర్యాదు ఎంత సమయంలోగా పరిష్కారమవుతుందనే విషయాన్ని మీకు ముందుగానే తెలియచేస్తాము.
- ‘మోసం – ఒకటికి పైగా ఏజెన్సీలు జోక్యం చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ప్రమాద అంచనా’కు సంబంధించిన ఫిర్యాదులను నిశితంగా పరిశీలించడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. అందుకే అటువంటి సందర్భాలలో కేసు తీవ్రత, సంక్లిష్టతను బట్టి పరిష్కార సమయాన్ని నిర్ణయిస్తాము. అటువంటి సందర్భాలలో ఎప్పటిలోగా పరిష్కారం అవుతుందో మీకు ముందుగానే తెలియచేస్తాము.
గమనిక: పరిష్కారం చూపడంలో ఏదైనా ఆలస్యం జరిగితే దాని గురించి యూజర్‌లకు ముందుగానే తెలియచేస్తాము.
2వ స్థాయి
- ఫిర్యాదుల నమోదు:
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000, అలానే దాని కింద రూపొందించిన నియమాలకు అనుగుణంగా, నోడల్ ఆఫీసర్, అలానే ప్రిన్సిపల్ నోడల్ ఆఫీసర్ పేరు, సంప్రదింపు వివరాలను ఈ కింద ఇచ్చాము:
సంప్రదించాల్సిన వారి వివరాలు:
ప్రిన్సిపల్ నోడల్ ఆఫీసర్ – సిను సుధాకర్
నోడల్ ఆఫీసర్ /గ్రీవెన్స్ ఆఫీసర్ – సించన్ కుమార్ సాహా
ఫోన్: 080-6872-7777/ 022-6872-7777
వెబ్‌పేజీ: https://grievance.phonepe.com/
చిరునామా – ఆఫీస్-2, ఫ్లోర్ 4,5,6,7, వింగ్ ఏ, బ్లాక్ ఏ, సలార్పురియా సాఫ్ట్‌జోన్, సర్వీస్ రోడ్, గ్రీన్ గ్లెన్ లేఅవుట్, బెల్లందూర్, బెంగళూరు, కర్ణాటక-KA, పిన్- 560103.
పని చేసే సమయం: సోమ-శుక్ర ఉదయం 10 నుండి సాయంత్రం 7 వరకు. - ఫిర్యాదుల పరిష్కారం:
ఫిర్యాదును స్వీకరించిన 24 గంటలలోపు మా మొదటి ప్రతిస్పందనను మీకు తెలియచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాము. మేము 2వ స్థాయిలో వచ్చే ఫిర్యాదులు అన్నింటినీ 7 పనిదినాల్లోగా పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. పరిష్కారం చూపడంలో ఏదైనా ఆలస్యం జరిగితే దాని గురించి యూజర్‌లకు ముందుగానే తెలియచేస్తాము.
3 వ స్థాయి
మొదటి రెండు స్థాయిల్లో వచ్చే మీ ప్రశ్నను లేదా ఫిర్యాదును 30 రోజులలోపు మీరు సంతృప్తి చెందే స్థాయిలో పరిష్కరించకపోతే, మీరు డిజిటల్ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చు.
అంబుడ్స్‌మన్ ఫిర్యాదు నమోదు పోర్టల్: https://cms.rbi.org.in/
టోల్-ఫ్రీ ఫోన్. నెం: 14448
ఈమెయిల్ ఐడి: [email protected]
చిరునామా – సెంట్రలైజ్డ్ రిసీట్, ప్రాసెసింగ్ సెంటర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 4వ అంతస్తు, సెక్టార్ 17, ఛండీగఢ్ – 160017
మరిన్ని వివరాల కోసం, దయచేసి ఈ లింక్‌ను చూడండి – RBI అంబుడ్స్‌మన్.